![]() |
![]() |
.webp)
స్మాల్ స్క్రీన్ స్టార్ట్ యాంకర్ రష్మీ ఇండస్ట్రీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. జబర్దస్ , శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి హోస్ట్ గా చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. యాంకరింగ్ మాత్రమే కాదు అటు వెండితెరపై కూడా తన టాలెంట్ ను నిరూపించుకుంటూనే ఉంది. గతంలో గుంటూర్ టాకీస్ పేరుతో వచ్చిన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మీ.
తాజాగా "బొమ్మ బ్లాక్ బస్టర్" తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మీ ఇక కాస్త బ్రేక్ తీసుకుంది. కొంచెం టైం చిల్ అవడానికి మాల్దీవులకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో మునిగి తన్మయత్వంతో సముద్రాన్నిచూస్తున్న ఫోటో ఇది. నీళ్ళల్లో ఒక మునకేసి తన చేతులతో లవ్ సింబల్ ను పెట్టింది రష్మీ."ఒన్స్ ఏ వాటర్ బేబీ ఆల్ వాజ్ ఏ వాటర్ బేబీ” అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
![]() |
![]() |